Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 9 sloka 15 to 21

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 9 sloka 15 to 21
Sloka 15-జ్ఞానసముపార్జన యజ్ఞము నందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునిగా, వివధరుపునిగా, విశ్వరూపునిగా పూజింతురు.
Sloka 16-నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్రమును అయి యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే.
Sloka 17-నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయియున్నాను. జ్ఞానలక్ష్యమును, పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము,యజుర్వేదములు కూడా నేనే.
Sloka 18-గమ్యమును, భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, విధానమును, అవ్యయ బీజమును అయి యున్నాను.
Sloka 19-ఓ అర్జునా! వేడినొసగువాడను, వర్షము నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్, అసత్తులు రెండును నా యందే యున్నవి.
Sloka 20-స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగముల ననుభవింతురు.
Sloka 21-విస్తృతమైన స్వర్గలోకభోగముల ననుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగివత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసరణము ద్వారా ఇంద్రియభోగమును వాంచించువారు కేవలము జననమరణములనే మరల, మరల పొందుదురు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.