Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 15 sloka 1 to 6

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 15 sloka 1 to 6
Sloka 1-శ్రీ భగవానుడు పలికెను : వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు.
Sloka 2-త్రి-గుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి, ఇంద్రియ విషయములు వాటికి చిగుళ్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేళ్ళాడుతూ ఉంటాయి. క్రిందిన, దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి, మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి.
Sloka 3 to 4-ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో తెలియబడదు, దాని యొక్క మొదలు, చివర లేదా సనాతన అస్థిత్వము కూడా అర్థం కాదు. కానీ, ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి/వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి, అదియే ఆ భగవంతుడు, ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము.
Sloka 5-దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తిని జయించినవారు, సతతమూ ఆత్మ, భగవంతుని చింతన లోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములనెడి ద్వందములకు అతీతులై ఉన్నవారు - ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు.
Sloka 6-సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.