Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 4 sloka 31 to 37

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 4 sloka 31 to 37
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 31-ఓ కురువంశ శ్రేష్టుడా! యజ్ఞమును నిర్వహింపకుండా ఎవ్వరును ఈ లోకముగాని, ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి యెడ తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేల?
Sloka 32-ఈ వివిధ యజ్ఞములన్నియును వేదములచే ఆమోదింపబడినవి మరియు అవియన్నియు వివిధకర్మల నుండి ఉద్బవించినవి. వానిని యథార్థరూపములో ఎరుగట ద్వారా నీవు ముక్తిని పొందగలవు.
Sloka 33-ఓ పరంతపా! జ్ఞానయజ్ఞము ద్రవ్యమయజ్ఞము కన్నను మహత్తరమైనది. ఓ పార్థా! కర్మయజ్ఞము లన్నియును చివరికి దివ్యజ్ఞానమునందే పరిసమాప్తి నొందును.
Sloka 34-గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయముతో ప్రశ్నలు వేసి సేవను గుర్చుము. ఆత్మదర్శులు తత్త్వదర్శనము చేసినవారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు.
Sloka 35-ఆత్మదర్శియైన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినపుడు ఆ జ్ఞానముచే సమస్తజీవులు పరమాత్ముని అంశలని, అనగా నాకు సంబంధించిన వారని గాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడును ఇట్టి మొహమునకు గురికావు.
Sloka 36-ఒకవేళ నీవు పాపులందరిలోను పరమపాపిగా భావింపబడినను దివ్యజ్ఞానమనెడి పడవ యందు స్థితుడవైనచో దుఃఖసముద్రమును దాటగలవు.
Sloka 37-ఓ అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు, జ్ఞానాగ్ని భౌతిక కర్మఫలముల నన్నింటిని బూడిదగా చేసివేయును.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.