Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 5 sloka 19 to 24

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 5 sloka 19 to 24
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 19-సమానత్వము మరియు ఏకత్వములందు మనస్సు నెలకొనినట్టివారు జననమరణస్థితిని జయించినట్టివారే. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగినట్టివారే యగుదురు.
Sloka 20-ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందనివాడును, స్థిరబుద్ధిని కలిగనవాడును, మోహపరవశుడు కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్ణముగా నెరిగినవాడును అగు మనుజుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగియున్నట్టివాడే యగును.
Sloka 21-అట్టి ముక్తపురుషుడు బాహ్యేంద్రియ సుఖమునకు ఆకర్షితుడు గాక ఆత్మయందే సౌఖ్యమనుభవించు సదా ధ్యానమగ్నుడై యుండును. పరబ్రహ్మమును ధ్యానించు కారణమున ఆత్మదర్శి ఆ విధముగా అనంతసౌఖ్యము ననుభవించును.
Sloka 22-బుద్ధిమంతుడైనవాడు ఇంద్రియసంపర్కముచే కలుగు దుఃఖకారణములందు పాల్గొనడుడు. ఓ కౌంతేయా! ఆ సుఖములు ఆద్యంతములు కూడియున్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు.
Sloka 23-దేహమును విడుచుటకు పూర్వమే ఇంద్రియముల కోరికలను అదుపు చేయగలిగిన వాడు, కామక్రోధవేగమును అణచగలిగినవాడు దివ్యస్థితి యందున్నట్టివాడై ఈ జగమునందు సుఖవంతుడగును.
Sloka 24-అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగినవాడును అగు మనుజుడే వాస్తవమునకు పూర్ణుడగు యోగి యనబడును. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. To be continued....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.