Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo..Chapter 11 Sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo..
Chapter 11 Sloka 1 to 7
Sloka 1-అర్జునుడు పలికెను: ఈ పరమరహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది.
Sloka 2-ఓ కమలపత్రాక్షా! సర్వజీవుల జననమరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసితిని మరియు అవ్యయములైన నీ మహాత్య్మములను కూడ గుర్తించితిని.
Sloka 3-ఓ పురుషోత్తమా! ఓ పరమేశ్వారా! నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థరూపమును నేను నా యెదుట చూడగలిగినను, నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచ నభిలషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించగోరుదును.
Sloka 4-హే ప్రభూ! యోగేశ్వరా! నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము.
Sloka 5-దేవదేవడైన శ్రీకృష్ణుడు పలికెను: ఓ అర్జునా! పృథాకుమారా! లక్షలాదిగాగల నానావిధములును, దివ్యములును, పలువర్ణమయలును అగు రూపములను (నా విభూతులను) ఇప్పుడు గాంచుము.
Sloka 6-ఓ భరతవంశశ్రేష్టుడా చూడుము అదితి కుమారులైన పండ్రెండుగురు ఆదిత్యులను;  ఎనమండుగురు ,వాసుస్( Snakes) పదునొకండు రుద్రులను;  ఇరువురు అశ్వినీకుమారులను; నలుబదితొమ్మిదిమంది మరుత్తులను (వాయుదేవతలను); అట్లే;  అదృష్టపూర్వాణి నీవు గతమునందు గాంచనటువంటి;   అన్ని అద్భుతములను చూడుము.
Sloka 7-ఓ అర్జునా! నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్ష్మింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర, జంగమాది సర్వము ఏకస్థానమున దీని యందే సంపూర్ణముగా కలవు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.