Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 5 sloka 7 to 12

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 5 sloka 7 to 12
Sloka 7-భక్తియోగముతో కర్మనొనరించువాడును, విశుద్ధాత్ముడును, ఇంద్రియ, మనస్సులను జయించినవాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై యుండును. సర్వుల యెడ అతడు ప్రియమును కలిగియుండును. అట్టివాడు సదాకర్మల నాచారించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు.
Sloka 8-9 దివ్యచైతన్యయుక్తుడైనవాడు చూచుట, వినుట, తాకుట, వాసనజూచుట, భుజించుట, కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటివి చేయుచున్నను తాను వాస్తవముగా ఏదియును చేయనట్లుగా ఎరిగియుండును. ఏలయన మాట్లాడునప్పుడు, గ్రహించునప్పుడు, విసర్జించునప్పుడు, కనులుతెరచుట లేక మూయుట జరుగునప్పుడు ఆయా ఇంద్రియములు ఇంద్రియార్థములలో వర్తించుచున్నవనియు మరియు తాను వాని నుండి దూరముగా నుంటిననియు అతడు సదా ఎరిగియుండును.
Sloka 10-ఫలముల నన్నింటిని భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు.
Sloka 11-యోగులైనవారు సంగత్వమును విడిచి ఆత్మశుద్ధి యను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సుతోడను, బుద్ధితోడను మరియు ఇంద్రియములతోడను కర్మ నొనరింతురు.
Sloka 12-స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వకర్మఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. కాని భగవద్భావనము లేనివాడు మరియు తన కర్మఫలము యెడ ఆసక్తిని కలిగియున్నవాడును అగు మనుజుడు బద్ధుడగును.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.