Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 50 to 55

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 50 to 55
Sloka 50-ధృతరాష్ట్రునితో సంజయుడు పలేకెను : దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజరూపమును ప్రదర్శించెను. భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఆశ్వాసమును గూర్చుచు అంత్యమున తన ద్విభుజ రూపమును చూపెను.
Sloka 51-ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్యరూపమును గాంచినంత ఇట్లు పలికెను: ఓ జనార్ధనా! అత్యంత సుందరమైన ఈ నీ మానవరూపమును గాంచి శాంతచిత్తుడవై నా సహజస్వభావమును పొందితివి.
Sloka 52-శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవిపుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిగుల దుర్లభమైనది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించు నవకాశమునకై దేవతలు సైతము నిత్యమూ వేచియుందురు.
Sloka 53-దివ్యచక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము వేదాధ్యయనముచే గాని, తీవ్రతపస్సులచే గాని, దానముచే గాని, పూజలచేగాని అవగతము కాదు. మనుజుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవియన్నియును సాధనములు కాజాలవు.
Sloka 54-ఓ ప్రియమైన అర్జునా! కేవలము అనన్యభక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడినరీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహనా రహస్యములందు ప్రవేశింపగలుగుదువు.
Sloka 55-ఓ ప్రియమైన అర్జునా! కామ్యకర్మలు, మనోకల్పనలనెడి కల్మషముల నుండి విడివడి నా శుద్ధభక్తి యందు నియుక్తుడయ్యెడివాడును, నన్నే తన జీవితపరమగమ్యముగా భావించి నా కొరకై కర్మనొనరించువాడును, సర్వజీవుల యెడ మిత్రత్వమును కలిగినవాడును అగు మనుజుడు తప్పక నన్నే చేరగలడు.
To be continued with chapter 12

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.