Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 45 to 49

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 45 to 49
Sloka 45-ఇదివరకెన్నడును చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించితిని. కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా! జగాన్నివాసా! నా యెడ కరుణను జూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము.
Sloka 46-ఓ విశ్వరూపా! సహస్రబాహో! కిరీటము ధరించి శంఖ,చక్ర, గద, పద్మములను హస్తములందు కలిగియుండెడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదురు. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను.
Sloka 47-శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! ప్రసన్నుడైన నేను ణా అంతరంగశక్తిచే భౌతికజగమునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమును, అనంతమును, ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరును గాంచియుండలేదు.
Sloka 48-ఓ కురుప్రవీరా! వేదాధ్యయనముచేత గాని, యజ్ఞములచేత గాని, దానములచేత గని, పుణ్యకర్మలచేత గాని, ఉగ్రమగు తపస్సులచేత గాని భౌతికజగమున ఈ రూపములలో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరును గాంచి యుండలేదు. 
Sloka 49-నా ఈ ఘోరరూపమును చూచి నీవు కలతనొందినవాడవు, భ్రాంతుడవు అయితివి. అదియంతయు నిపుడు అంతరించును గాక, ఓ భక్తుడా! అన్ని కలతల నుండియు విముక్తుడవై నీవు కోరిన రూపమును ప్రశాంతమనస్సుతో ఇప్పుడు గాంచుము.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.