Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 33 to 38

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 33 to 38
Sloka 33-అందుచే లెమ్ము. యుద్ధసన్నద్ధుడవై కీర్తిని గడింపుము. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యము ననుభవింపుము. ఓ సవ్యసాచీ! నా ఏర్పాటుచే వారందరును ఇదివరకే మరణించియున్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్తమాత్రుడవగుము.
Sloka 34-ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహా యోధులందరును నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏ మాత్రము వ్యథనొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు.
Sloka 35-ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను; ఓ రాజా! దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల మరల వందనముల నొసగెను. భీతిని కూడినవాడై అతడు డగ్గుత్తికతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.
Sloka 36-అర్జునుడు పలికెను : ఓ హృశీకేశా! నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించి, ప్రతియొక్కరు నీ యెడ అనురక్తులగుచున్నారు. సిద్ధసమూహములు నీకు గౌరవపుర్వకముగా అంజలి ఘటించుచున్నను రాక్షసులు భీతిచెందినవారై పలుదిక్కుల పలాయనమగుచున్నారు. ఇది యంతయు యుక్తముగనే ఉన్నది. 
Sloka 37-ఓ మహాత్మా! బ్రహ్మదేవుని కంటేను ఘనమైనవాడా! నీవే ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు నమస్సులు అర్పింపరు? ఓ అనంతా! దేవదేవా! జగన్నివాసా! నీవు అక్షయమగు మూలమువు, సర్వకారణకారణుడవు, ఈ భౌతికసృష్టికి అతీతుడవు.
Sloka 38-నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయము. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్యశరణ్యుడవు. ఓ అనంతరుపా! ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడియున్నది. 
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.