Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 4 sloka 18 to 24

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 4 sloka 18 to 24
శ్రీ కృష్ణుడు పలికెను....
Sloka 18-కర్మ యందు ఆకర్మను మరియు అకర్మ యందు కర్మను గాంచువాడు మనుజులలో బుద్ధిమంతుడైనవాడు. అట్టివాడు అన్నిరకముల కర్మలు యందు నియుక్తుడైన దివ్యస్థితి యందున్నవాడే యగును.
Sloka 19-ఎవని ప్రతికర్మయు భోగవాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణజ్ఞానము కలిగినట్టివాడు. కర్మఫలములన్నియు జ్ఞానగ్నిచే దగ్ధమైనవిగా(జ్ఞానాగ్నిదగ్దకర్మడు) అతడు ఋషులచే చెప్పబడును.
Sloka 20-కర్మఫలముల యెడ ఆసక్తిని విడిచి నిత్యతృప్తుడును, నిరాశ్రయుడును అయియుండెడివాడు అన్నిరకములగు కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే యగును.
Sloka 21-అట్టి అవగాహనము కలిగిన మనుజుడు మనుజుడు నియమిత మనోబుద్దులచే తనకున్నవానిపై స్యామ్యభావన విడిచి, కేవలము జీవనావసరముల కొరకే కర్మనొనరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాపఫలములచే ప్రభావితుడు కాకుండును.
Sloka 22-యాదృచ్చికముగా లభించినదానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడును, అసూయ లేనివాడును, జయాపజయములందు స్థిరుడై యుండెడివాడును అగు మనుజుడు కర్మలకు ఒనరించుచున్నను ఎన్నడును బంధితుడు కాడు.
Sloka 23-ప్రకృతి త్రిగుణముల యెడ అసంగుడై దివ్యజ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మనుజుని సర్వకర్మల దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును.
Sloka 24-కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధామమును తప్పక పొందితీరును. స్వీకరించునది మరియు అర్పింపబడునది యను రెండును బ్రహ్మమేయైనటువంటి ఆధ్యాత్మికకర్మల యందు అతడు తత్పరుడై యుండుటచే అందులకు కారణము.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.