Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 10 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 10 sloka 22 to 28
Sloka 22-నేను వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతియైన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి ప్రాణమును(చైతన్యమును) అయి యున్నాను. 
Sloka 23-నేను రుద్రులలో శివుడను, యక్ష, రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి యున్నాను.
Sloka 24-ఓ అర్జునా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్నెరుగుము. నేను సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో సముద్రమునై యున్నాను. 
Sloka 25-నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైనవానిలో హిమాలయమును అయి యున్నాను. 
Sloka 26-నేను వృక్షములలో రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడను అయి యున్నాను.
Sloka 27-అశ్వములలో అమృతము కొరకై సాగరమంథనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజును అయి యున్నాను.
Sloka 28-నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మథుడను మరియు సర్పములలో వాసుకుని అయి యున్నాను.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.