Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 5 sloka 1 to 6

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 5 sloka 1 to 6
Sloka 1-అర్జునుడు ఇట్లు పలికెను: ఓ కృష్ణ! తొలుత నన్ను కర్మత్యాగము చేయుమని చెప్పి తిరిగి భక్తియుతకర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము.
Sloka 2-శ్రీకృష్ణభగవానుడు సమాధానమొసగెను; కర్మపరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములో. కాని ఆ రెండింటిలో కర్మపరిత్యాగము కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది.
Sloka 3-కర్మఫలములను ద్వేషించుట గాని, కోరుట గాని చేయనివాడు నిత్యసన్న్యాసిగా తెలియబడును. ఓ మహాబాహుడవైన అర్జునా! ద్వంద్వముల నుండి విడివడి యుండు అట్టివాడు లౌకికబంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు.
Sloka 4-కేవలము అజ్ఞానులే భక్తియోగమును(కర్మయోగము) భౌతికజగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు(సాంఖ్యమునకు) భిన్నమైనదిగా పలుకుదురు. కాని ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మనుజుడు పొందగలడని పండితులు చెప్పుదురు.
Sloka 5- సాంఖ్యము ద్వారా పొందబడు స్థానమును భక్తియోగము ద్వారాను పొందవచ్చునని ఎరిగి, తత్కారణముగా భక్తియోగము మరియు సాంఖ్యములను ఏకస్థాయిలో నున్నవానిగా గాంచువాడు యథార్థదృష్టి కలిగినవాడగును.
Sloka 6-భక్తియుతసేవ యందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందలేరు. కాని భక్తియోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.