Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 6 sloka 8 to 12

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 6 sloka 8 to 12
Sloka 8-మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన,విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినపుడు ఆత్మానుభవము నందు స్థితిని పొందినట్టివాడై యోగి యనబడును. అట్టివాడు ఆధ్య్తాత్మికస్థితి యందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగియుండును. అతడు గులకరాళ్లనైనను, రాళ్ళనైనను లేదా బంగారమైనను సమానముగా గాంచును.
Sloka 9-శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించువారలను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ది నొందినవానిగా పరిగణింపబడును.
Sloka 10-యోగియైనవాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సదా భగవానుని సంబంధములో నియుక్తము చేసి, ఒంటరిగా ఏకాంతస్థలమునందు నివసించుచు సావధానముగా మనస్సు నియమింపవలెను. అతడు కోరికల నుండియు మరియు సమస్తమును కలిగియుండవలెనను భావనలనుండియు ముక్తుడై యుండవలెను.
Sloka 11-12 యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంతస్థాలమున కేగి నేలపై కుశగ్రాసమును పరచి, దానిని జింకచర్మము మరియు వస్త్రముతో కప్పవలెను, అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్రస్థానములో ఏర్పాటు కావలెను. పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియమనోకర్మలను నియమించి, మనస్సును ఏకాగ్రపరచి హృదయశుద్ధి కొరకు యోగము నభ్యసించవలెను.
To be continued....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.