Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 6 sloka 27 to 33

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 6 sloka 27 to 33
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 27-నా యందు మనస్సు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మికానందపు అత్యున్నత పుర్ణత్వమును బడయును. రజోగుణమునకు పరముగా నుండు అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఎకతము నెరిగి పూర్వ కర్మఫలములన్నింటి నుండియు ముక్తుడగును.
Sloka 28-ఆ విధముగా ఆత్మనిగ్రహుడైన యోగి నిరంతరము యోగము నభ్యసించును భౌతికకల్మషములకు దూరుడై, భగవానుని దివ్యమైన ప్రేమయుతసేవ యందు అత్యున్నతమైన పూర్ణానందస్థితిని పొందును.
Sloka 29-నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచును. ఆత్మదర్శియైన అట్టివాడు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును.
Sloka 30-నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తము గాంచువానికి నేను కనబడకపోవుట గాని, నాకు అతడు కనబడకపోవుట గాని జరుగదు.
Sloka 31-నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురుము ఏకమేనని ఎరిగి పరమాత్మ భజనమందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నా యందే నిలిచియుండును.
Sloka 32-ఓ అర్జునా! ఎవడు తనతో పోల్చుకొని సమస్తజీవులకు వాటి సుఖదుఃఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమయోగి యనబడును.
Sloka 33-అర్జునుడు పలికెను : ఓ మధుసుదనా! మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయియున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగపద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.