Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 6 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 6 sloka 1 to 7
Sloka 1-శ్రీకృష్ణభగవానుడు పలికెను: కర్మఫలముల యెడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్న్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతియేగాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక యుండెడి వాడు యోగి కాజాలడు. 
Sloka 2-ఏది సన్న్యాసమని పిలువబడునో దానిని యోగామనియు (భగవానునితో కలయిక) నీవు తెలిసికొనుము. ఓ పాండుకుమారా! ఇంద్రియప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవ్వడును యోగి కాజాలడు.
Sloka 3-అష్టాంగయోగపద్ధతి యందు ఆరంభస్థితిలో నున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబాడగా, యోగమునందు సిద్ధిని పొందినవానికి భౌతికకర్మల విరమణ సాధనముగా చెప్పబడినది.
Sloka 4-విషయకోరికల నన్నింటిని విడిచి ఇంద్రియప్రీతి కొరకు వర్తించుట గాని, కామ్యకర్మలందు నియుక్తుడగుట గాని చేయని మనుజుడు యోగారూఢుడని చెప్పబడును.
Sloka 5-ప్రతియొక్కడు తన మనస్సుయొక్క సహాయముచే తనను తాను ఉద్దరించుకొన వలెనే గాని అధోగతిపాలు చేసికొనరాదు. బద్ధజీవునికి మనస్సనునది మిత్రుడును, అలాగుననే శత్రువును అయియున్నది.
Sloka 6-మనస్సును జయించినవానికి మనస్సే ఉత్తమమిత్రుడు. కాని అట్లు చేయలేనివానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును.
Sloka 7-మనస్సు జయించినవాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినట్టివాడే యగును. అట్టి మనుజునకు సుఖదుఃఖములు, శీతోష్ణములు, మానవమానములు అన్నియును సమానములె అయియున్నవి.
To be continued.....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.