Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 9 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 9 sloka 22 to 28
Sloka 22-నా దివ్యరూపమును ధ్యానించుచు అనన్యభక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షేమములను నేనే వహింతును (వారికి లేనివి సమకూర్చి, ఉన్నవి సంరక్షింతును).
Sloka 23-ఓ కౌంతేయా! అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు.
Sloka 24-నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయియున్నాను. కావున నా వాస్తవమైన దివ్యస్వభావమును గుర్తింపలేనివారు పతనము చెందుదురు.
Sloka 25-దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత, ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు.
Sloka 26-పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను, భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును.
Sloka 27-ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.
Sloka 28-ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్న్యాసయోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.