Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 12 sloka 15 to 20

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 12 sloka 15 to 20
Sloka 15-ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.
Sloka 16-సాధారణ కార్యకలాపముల నాశ్రఇంపనివాడును, పవిత్రుడును, సమర్తుడును, ఉదాసీనుడును, సర్వవ్యథల నుండి ముక్తుడైనవాడును, ఏదేని ఫలము కొరకై తీవ్రకృషి చేయనివాడును అగు నా భక్తుడు నాకు మిగుల ప్రియుడు.
Sloka 17-ఉప్పొంగుటగాని దుఃఖించుటగాని తెలియనివాడు, శోకించుటగాని వాంచించుట గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటిని త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు.
Sloka 18 to 19-శత్రుమిత్రుల యెడ సమభావము కలిగినవాడును, మానావమానములందు, శీతోష్ణములందు, సుఖదుఃఖములందు, నిందాస్తుతులందు సమబుద్ధి కలిగినవాడును, అసత్సంగము నుండి సదా విడివడియుండువాడును, సదా మౌనియైనవాడును, దేనిచేతనైనను సంతుష్టి నొందెడివాడును, నివాసమేదైనను లెక్క చేయనివాడును, జ్ఞానమునందు స్థితుడైనవాడును, నా భక్తియుతసేవ యందు నియుక్తుడైనట్టివాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు.
Sloka 20-నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తియోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు.
To be continued with chapter 13

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.