Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 6 sloka 34 to 40

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 6 sloka 34 to 40
Sloka 34- అర్జునుడు పలికెను  ఓ కృష్ణా! మనస్సు చంచలమును, కల్లోలపూర్ణమును, దృఢమును, మిగుల బలవత్తరమును అయి యున్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నాను కష్టతరమని నేను భావించుచున్నాను.
Sloka 35-శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ గొప్పభుజములు కలిగిన కుంతీపుత్రా! చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగులకష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును.
Sloka 36-మనస్సు నిగ్రహింపబడినవానికి ఆత్మానుభవము అతికష్టకార్యము. కాని మనోనిగ్రహము కలిగి, తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము.
Sloka 37-అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! తొలుత ఆత్మానుభవ విధానము శ్రద్ధతో అనుసరించి, పిదప లౌకికభావన కారణముగా దానిని త్యజించి, యోగమునందు పూర్ణత్వమును పొందలేని విఫలయోగి గమ్యమెట్టిది?
Sloka 38-ఓ మాహాబాహో శ్రీకృష్ణా! ఆధ్యాత్మికమార్గము నుండి వైదొలగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మికజయము మరియు లౌకికజయమును రెండింటిని పొందినవాడై ఎచ్చోటను స్థానము లేకుండా గాలిచే చెదరిన మేఘము వలె నశింపడా?
Sloka 39-ఓ కృష్ణా! ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను వేడుచున్నను. నీవు తప్ప ఈ సందేహమును నివారించువారు వేరెవ్వరును లేరు.
Sloka 40-శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ పార్థా! శుభకార్యముల యందు నియుక్తుడైనవాడు ఈ లోకమున గాని, పరలోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా! మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.