Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 14 slokas 1 to 8

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 14 slokas 1 to 8
Sloka 1- శ్రీ భగవానుడు పలికెను: నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన  జ్ఞానమును నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు.
Sloka 2-ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు, సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు.
Sloka 3 to 4 -ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో  నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను, ఆ విధంగా సమస్త జీవరాశులు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతి యే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని.
Sloka 5-ఓ మహా బాహువులు కల అర్జునా, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది - సత్త్వ గుణము, రజో  గుణము, మరియు తమో గుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నాశనమయ్యే దేహమునకు బంధించును.
Sloka 6-వీటిలో సత్త్వ గుణము మిగతావాటి కంటే పవిత్రమైనది, ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది.  ఓ పాప రహితుడా, జ్ఞానము మరియు సుఖానుభవము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది.
Sloka 7-ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తి తో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు అనురాగముల వలన జనిస్తుంది మరియు ఆత్మను కామ్య కర్మల పట్ల ఆసక్తి చే బంధించివేస్తుంది.
Sloka 8-ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్ర చే భ్రమకు గురి చేస్తుంది.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.