Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 4 sloka 38 to 42

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 4 sloka 38 to 42
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 38-ఈ జగమునందు ఆధ్యాత్మికజ్ఞానము వలె పవిత్రమైనది మరియు మహోన్నతమైనది వేరొక్కటి లేదు. సకల యోగముల పక్వఫలమైన ఆ జ్ఞానమును భక్తియోగాభ్యాసమునందు పరిపక్వతను సాధించినవాడు కాలక్రమమున తన యందే అనుభవించును.
Sloka 39-దివ్యజ్ఞానతత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మికజ్ఞానమును పొందుట అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును.
Sloka 40-శాస్త్రములను శంకించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవత్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైనవారికి ఈ లోకమున గాని, పరలోకమున గాని సుఖము లేదు.
Sloka 41-కర్మఫలముల నన్నింటిని త్యచించి భక్తియోగమునందు వర్తించుచు దివ్యజ్ఞానముచే సందేహములు నశించియున్నవాడు వాస్తవముగా ఆత్మ యందే స్థితుడైనట్టివాడు. ఓ ధనంజయా! ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధితుడు కాడు.
Sloka 42-కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞానఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భారతా! యోగసమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము!
To be continued with 5th chapter

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.