Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 39 to 44

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 39 to 44
Sloka 39-వాయువును మరియు పరం నియామకుడును నీవే! అగ్ని, జలము, చంద్రుడవు నీవే! ఆదిజీవియైన బ్రహ్మదేవుడవు మరియు ప్రపితామహుడవు నీవే. కనుకనే నీకు వేయినమస్కారములు జేయుచు, మరల మరల వందనముల నర్పించుచున్నాను.
Sloka 40-నీకు ముందు నుండి, వెనుక నుండి, సర్వదిక్కుల నుండి నమస్కారముల నర్పించుచున్నాను. ఓ అనంతవీర్యా! నీవు అమితవిక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి. కనుకనే సర్వమును నీవే అయి యున్నావు.
Sloka 41-42 -నీ మహిమము తెలియక నిన్ను మిత్రునిగా భావించి “ఓ కృష్ణా”, “ఓ యాదవా”, “ ఓ మిత్రమా” అని తొందరపాటుగా సంబోధించితిని. ప్రేమతోగాని లేదా మూర్ఖత్వముతోగాని నేనొరించిన దానినంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు ఒంటరిగా కొన్నిమార్లు మరియు పలుమిత్రుల సమక్షమున మరికొన్నిమార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరపరచితిని. ఓ అచ్యుతా! ఆ అపరాధములన్నింటికిని నన్ను క్షమింపుము.
Sloka 43-స్థావర, జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వమునకు నీవే తండ్రివి. దానికి ముఖ్యపూజనీయుడగు పరమ ఆధ్యాత్మికగురుడవు నీవే. నీతో సమానమైనవాడు గాని, ఏకమైనవాడుగాని మరొకడుండడు. ఓ అపరిమితశక్తి సంపన్నుడా! అట్టి యెడ నీ కన్నను అధికుడు ముల్లోకములలో ఎవడుండును?
Sloka 44-నీవు ప్రతిజీవికిని పూజనీయుడైన దేవదేవుడవు. కనుకనే సాష్టాంగపడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలిని ప్రియుడు సహించునట్లు, నీ యెడ నొనరించిన నా తప్పులను దయతో సహింపుము.
To be continued..

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.