Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 6 sloka 13 to 19

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 6 sloka 13 to 19
Sloka 13-14  శరీరము, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రికరింపవలెను. ఆ విధముగా కలతనొందనటువంటి నియమిత మనస్సుతో, భయమును వీడి, బ్రహ్మచర్యమును పాటించుచు యోగియైనవాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవితపరమగతిగా చేసికొనవలెను.
Slok 15-దేహము, మనస్సు, కర్మలను ఈ విధముగా నిరంతరము మియమించుచు యోగియైనవాడు నియమితమనస్సు కలవాడై భౌతికస్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును (కృష్ణధామమును) పొందును.
Sloka 16-ఓ అర్జునా! అతిగా భుజించువానికి లేదా అతితక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేనివానికి యోగి యగుటకు అవకాశము లేదు.
Sloka 17-నియమితులైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతికక్లేశములను శమింపజేసికొనగలడు.
Sloka 18-యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలనన్నింటిని నియమించి, విషయకోరికల రహితమైన ఆధ్యాత్మికస్థితి యందు- నిలిచినప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడును.
Sloka 19-గాలి లేని చోట నున్న దీపము నిశ్చలముగా నుండు రీతి, నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్త్వధ్యానమున సదా స్థిరుడై యుండును.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.