Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 16 sloka 1 to 6

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 16 sloka 1 to 6
Sloka 1 to 3- శ్రీ భగవానుడు పలికెను : ఓ భరత వంశీయుడా,   దైవీ సంపద కలవాని లక్షణములు ఇవి - నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో ధృఢసంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంధ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం; అహింస, సత్య సంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణులపట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణుకువ మరియు నిశ్చలత్వము; బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట మరియు డాంభికము లేకుండుట.
Sloka 4-ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావము కల వారి గుణములు.
Sloka 5-దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ, ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి. బాధపడకు అర్జునా, నీవు దైవీ గుణములతోనే జన్మించావు.
Sloka 6-ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు - దైవీ గుణములు కలిగిఉన్నవారు  మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను, ఓ అర్జునా, ఆసురీ స్వభావమును గురించి చెప్తాను, వినుము.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.