Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 4 sloka 4 to 10

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 4 sloka 4 to 10
అర్జునుడు పలికెను : సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్నను పూర్వుడు. అట్టి యెడ ఆదిలో నీవీ జ్ఞానమును అతనికి ఉపదేశించితివనుటను నేనెట్లు అర్థము చేసికొనగలును?
Sloka 5-దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : ఓ  పార్థా! నీకును మరియు నాకును పలుజన్మలు గడిచినవి. నాకు అవియన్నియును జ్ఞప్తియందున్నవి. కాని నీవు వానిని జ్ఞప్తి యందుంచుకొనజాలవు.
Sloka 6-జన్మలేనివాడనైనను, నా దివ్యదేహము ఎన్నడును నశింపనిదైనను, సకలజీవులకు ప్రభువునైనను ఆదియైన దివ్యరూపముతో నేను ప్రతియుగము నందును అవతరింతును.
Sloka 7-యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహం ||

TRANSLATION:-
ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధినొందునో ఆ సమయమున నేను అవతరింతును.
Sloka 8-పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||

TRANSLATION:-
సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పున:స్థాపించుటకు ప్రతియుగమునందును నేను అవతరించుచుందును.
Sloka 9-ఓ అర్జునా! నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీరత్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతికజగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు.
Sloka 10-రాగము, భయము, క్రోధము నుండి విడివాడి, నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్యప్రేమను పొందగలిగిరి.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.