Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 1 to 7
Sloka 1-అర్జునుడు పలికెను : ఓ మహాబాహువులు కల కృష్ణా, 'సన్యాసము' (కర్మలను త్యజించటము) మరియు 'త్యాగము' (కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటమూ) ల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషీకేశా, వాటి మధ్య తేడాని కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది, ఓ కేశినిషూదనా.
Sloka 2-శ్రీ భగవానుడు ఇలా పలికెను : కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగము అని అన్నారు.
Sloka 3-కొంతమంది జ్ఞానసంపన్నులు అన్ని రకముల కర్మలను దోషభూయిష్టమైనవి అని వాటిని విడిచిపెట్టాలి అంటారు, అదే సమయంలో మరికొంతమంది, యజ్ఞము, దానము మరియు తపస్సు లను ఎన్నడూ విడిచిపెట్టవద్దు అంటారు.
Sloka 4-త్యాగము అన్న విషయముపై ఇక ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము, ఓ పురుషవ్యాఘ్రమా, త్యాగము అనేది మూడు విధములుగా ఉంటుంది అని చెప్పబడినది.
Sloka 5-యజ్ఞము, దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు; అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి.
Sloka 6-ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు, ఓ అర్జునా.
Sloka 7-విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.