Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 12 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 12 sloka 8 to 14
Sloka 8-దేవదేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు.
Sloka 9-ఓ అర్జునా! ధనంజయా! స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో, భక్తియోగమునందలి విధివిధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధిచేసికొనుము.
Sloka 10-భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మచేయుట ద్వారా నీవు పూర్ణశక్తిని పొందగలవు.
Sloka 11-అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో త్యాగము చేసి ఆత్మస్థితుడవగుట యత్నింపుము.
Sloka 12-ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞానసముపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికిని జ్ఞానముకన్నను ధ్యానము మేలైనది. కాని త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మఫల త్యాగము ఆ ధ్యానము కన్నను మేలితరమైనది.
Sloka 13 to 14-ద్వేషమనునది లేకుండ సర్వజీవుల యెడ మైత్రిని కలిగినవాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖదుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైనవాడును, ఆత్మనిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢనిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.