Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 17 sloka 8 to 15

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 17 sloka 8 to 15
Sloka 8-సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు - ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.
Sloka 9-అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్ధములు రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియి వ్యాధులను కలుగ చేస్తాయి.
Sloka 10-ఎండిపోయిన/మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము - తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి.
Sloka 11-ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ, ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో ధృఢ సంకల్పము తో, చేసిన యజ్ఞము సత్త్వ గుణము తో చేయబడినట్టు.
Sloka 12-ఓ, భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము.
Sloka 13-శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాల విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును.
Sloka 14-పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు మరియు పెద్దలు - వీరి ఆరాధన, శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యం, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడుతాయో - అది శారీరిక తపస్సు అని చెప్పబడును.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.