Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 29 to 35

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 29 to 35
Sloka 29-ఇప్పుడు వినుము ఓ అర్జునా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను.
Sloka 30-ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు బుద్ధి సత్త్వగుణములో ఉన్నది అని చెప్పబడును.
Sloka 31-ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి , రజోగుణములో ఉన్నట్టు.
Sloka 32-చీకటితో ఆవృత్తమై, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి.
Sloka 33-యోగము ద్వారా పెంపొందించుకున్న ధృడ చిత్త సంకల్పము; మరియు మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని, సత్త్వ గుణ దృఢమనస్కత అంటారు.
Sloka 34-ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము (విధులు), కామము (సుఖములు) మరియు అర్థము(సంపద) పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును.
Sloka 35-విడువకుండా, పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనవుతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ది సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు.
To be continued..

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.