Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 20 to 22

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 20 to 22
Sloka 20-విషయకోరికలచే జ్ఞానము అపహరింపబడినవారు ఇతర దేవతలకు శరణమునొంది తమ గుణములను బట్టి ఆయా పూజావిధానములను అనుసరింతురు.
Sloka 21-నేను ప్రతివారు హృదయమునందు పరమాత్మరూపున నిలిచియుందును. ఎవరేని ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును.
Sloka 22-అట్టి శ్రద్ధను పొందినవాడై మనుజుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. కాని వాస్తవమునకు ఆ వరములన్నియును నా చేతనే ఒసగబడుచున్నవి.
PURPORT:-
శ్రీకృష్ణభగవానుని అనుజ్ఞ లేనిదే దేవతలు తమ భక్తులకు ఎట్టి వరములను ఒసగలేరు. సర్వము శ్రీకృష్ణభగవానునికి చెందినదే యున్న విషయమును జీవులు మరచినను దేవతలు మాత్రము మరువరు. అనగా దేవతార్చనము మరియు తద్ద్వారా ఇష్టసిద్ధి యనునవి దేవతల వలన గాక ఆ భగవానుని ఏర్పాటు వలననే జరుగుచుండును. అల్పజ్ఞుడైన జీవుడు ఈ విషయము నెరుగలేడు. కనుకనే మూర్ఖముగా అతడు కొద్దిపాటి లాభమునకై దేవతల నాశ్రయించును. కాని శుద్ధభక్తుడు మాత్రము ఏదేని కావలసివచ్చినప్పుడు ఆ భగవానునే ప్రార్థించును. అయినను ఆ విధముగా భౌతికలాభమును అర్థించుట శుద్ధభక్తుని లక్షణము కాదు. సాధారణముగా జీవుడు తన కామమును పూర్ణము చేసికొనుట యందు ఆతురతను కలిగియుండును కనుక దేవతల నాశ్రయించును. జీవుడు తనకు తగనటువంటిదానిని కోరగా భగవానుడు అట్టి కోరికను తీర్చనప్పుడు ఆ విధముగా జరుగుచుండును.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.