Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 10 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 10 sloka 8 to 14
Sloka 8-నేనే సర్వములైన ఆధ్యాత్మిక, భౌతికజగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపుర్వకముగా అర్చింతురు.
Sloka 9-నా శుద్ధభక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై, వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై యుండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవింతురు.
Sloka 10-ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైనవారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనొసగుదును. 
Sloka 11-నేను వారి యెడ ప్రత్యేకకరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు, తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింపజేయుదును.
Sloka 12-13- అర్జునుడు ఇట్లు పలికెను: నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్త్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేనివాడవు, ఘనమైనవాడవు అయియున్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహాఋషులందరును నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధ్రువపరచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమున నాకు తెలియజేయుచున్నావు.
Sloka 14-ఓ కృష్ణా! నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను ఆంగీకరించుచున్నాను. ఓ దేవదేవా! దేవతలుగాని, దానవులుగాని నీ స్వరూపమును ఎరుగజాలరు.
To be continued..

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.