Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 22 to 28
Sloka 22-సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది.
Sloka 23-ఏదైతే కర్మ - శాస్త్రబద్దముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో, అది సత్త్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది.
Sloka 24-స్వార్ధ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును
Sloka 25-మోహభ్రాంతి వల్ల ప్రారంభించి, తమ యొక్క స్వ-శక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా - చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు.
Sloka 26-అహంకారము మరియు సంగ రహితముగా ఉన్నవారు, మరియు ఉత్సాహము, ధృడసంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు సత్త్వగుణ కర్తలు అని చెప్పబడ్డారు.
Sloka 27-కర్మఫలముల పట్ల ఆసక్తి తో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమవుతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడుతాడు.
Sloka 28-క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్దకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసేవారిని - తమోగుణ కర్తలు అనవచ్చు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.