Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 5 sloka 25 to 29

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
శ్రీ కృష్ణుడు పలికెను
Chapter 5 sloka 25 to 29
Sloka 25-అంతరంగమందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు పరమైనవారును, సర్వజీవహితము కొరకే పనిచేయువారును, సర్వపాపదూరులైనవారును అగు ఋషులే బ్రహ్మనిర్వాణమును పొందుదురు.
Sloka 26-కామక్రోధము నుండి విడివడినవారును, ఆత్మదర్శులును, ఆత్మసంయమనము కలిగినవారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారును అగు మాహాత్ములు అచిరకాలములోనే బ్రహ్మనిర్వాణము నిశ్చయముగా బడయుదురు.
Sloka 27-28 బాహ్యేంద్రియార్థములన్నింటిని త్యజించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, ప్రాణాపాన వాయువులను నాసిక యందే సమములుగా చేసి తద్ద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను అదుపుజేయునట్టి మోక్షవాంచితుడు కోరిక, భయము, కోపముల నుండి ముక్తుడగును. అట్టి స్థితిలో సదా నిలిచియుండువాడు నిక్కముగా ముక్తిని పొందగలడు.
Sloka 29-నా సంపూర్ణభావన యందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చరమభోక్తగను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగను, సకలజీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలిసికొని భౌతికదుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును.
To be continued....with 6th chapter

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.