Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 8 sloka 8 to 14

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 8 sloka 8 to 14
Sloka 8-ఓ పార్థా! మనస్సును ఎల్లవేళలా నా స్మరణమునందే నియుక్తముజేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసెడివాడు నన్ను తప్పక చేరగలడు.
Sloka 9-నియమించువాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైనవాడను, సమస్తమును పోషించువాడును, భౌతికభావనలకు పరమైనవాడును, అచింత్యుడును, రూపసహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగను మరియు ప్రాచీనునిగను ప్రతియొక్కరు ధ్యానము చేయవలెను. సూర్యుని వలె తేజోసంపన్నుడును మరియు దివ్యుడును అగు అతడు భౌతికప్రకృతికి అతీతుడు.
Sloka 10-మరణసమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి, యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తిభావమున భగవానుని స్మరించెడివాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు.
Sloka 11-వేదవిదులైనవారును, ఓంకారమును ఉచ్చరించువారును, సన్న్యాసాశ్రమము నందున్న మహర్షులు అగు మనుజులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరినవారు బ్రహ్మచర్యవ్రతము నభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానము ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును.
Sloka 12-ఇంద్రియకర్మల నుండు విడివడియుండుటయే యోగస్థితి యనబడును. సర్వేంద్రియద్వారములను మూసివేసి, మనస్సును హృదయమునందు స్థిరము చేసి, ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు.
Sloka 13-ఈ యోగవిధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మికలోకములను పొందగలడు.
Sloka 14-ఓ పార్థా! అనన్యచిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుతసేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై యున్నాను.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.