Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 8 sloka 15 to 21

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 8 sloka 15 to 21
Sloka 15-భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసినవారగుటచే దు:ఖాలయమైన ఈ అనిత్యజగమునకు ఎన్నడును తిరిగిరారు.
Sloka 16-భౌతికజగమునందలి అత్యున్నతలోకము మొదలుకొని అధమలోకము వరకుగల సర్వలోకములు జన్మమృత్యుభరితమైన దుఃఖప్రదేశములలే. కాని ఓ కౌంతేయా! నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు.
Sloka 17-మానవపరిగణనము ననుసరించి వేయియుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణము కలిగియుండును.
Sloka 18-బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరు అవ్యక్తస్థితి నుండి వ్యక్తము చెంది, పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు.
Sloka 19-బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనపుడు జీవులు మరల మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశులై నశింతురు.
Sloka 20-వ్యక్తావ్యక్తములయ్యెడి ఈ భౌతికప్రకృతి కన్నను పరమైనదియు, శాశ్వతమైనదియు నగు అవ్యక్తప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్టమును, నాశరహితమును అయియున్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అదిమాత్రము యథాతథముగా నిలిచియుండును.
Sloka 21-వేదాంతులు దేనిని అవ్యక్తము, అక్షరమని వర్ణింతురో, ఏది పరమగమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగిరాడో అదియే నా దివ్యధామము.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.