Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 Sloka 26 to 32

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 Sloka 26 to 32
Sloka 26-27 - తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్రతనయులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోళ్ళ యందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత శిరులై తగుల్కొనుటయు నేను గాంచుచున్నాను.
Sloka 28-నదీప్రవాహములు సముద్రమునందు ప్రవేశించు రీతి, ఈ మహాయోధులందరును నీ నోళ్ళ యందు ప్రవేశించి మండిపోవుచున్నారు.
Sloka 29-జ్వలించు అగ్ని యందు నాశము కొరకై శలభములు ప్రవేశించురీతి, జనులందరును అత్యంతవేగముగా నీ వక్త్రములందు ప్రవేశించుచున్నట్లు నేను గాంచుచున్నాను.
Sloka 30-ఓ విష్ణూ! నీవు సమస్తజనులను నీ మండుచున్న నోళ్ళ ద్వారా అన్ని వైపుల నుండియు మ్రింగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి, భయంకరములును మరియు తాపకరములును అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు.
Sloka 31-ఓ దేవవర! భయంకర రూపముతోనున్న నీవెవరవో నాకు దయతో తెలియజేయుము. నీకు వందనముల నర్పించెదను; నా యెడ ప్రసన్నుడవగుము. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమును ఎరుగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలిసికొనగోరుచున్నాను.
Sloka 32-దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను : నేను ఘనమైన లోకవినాశకర కాలమును. జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటకు అరుదెంచితిని. నీవు (పాండవులు) తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరును చంపబడనున్నారు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.