Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 9 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 9 sloka 1 to 7
Sloka 1 -శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవు నా యెడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమజ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసెదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతికస్థితి వలన కలిగెడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు.
Sloka 2-ఈ జ్ఞానము విద్యలకెల్ల రాజు వంటిది మరియు సర్వరహస్యములలో పరమరహస్యమైనది. పరమపవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షజ్ఞానము కలుగజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై యున్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది.
Sloka 3-ఓ శత్రుంజయుడా! ఈ భక్తియుతసేవ యందు శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతికజగమునందలి జనన, మరణమార్గమునకే తిరిగివత్తురు.
Sloka 4-సమస్తజగత్తు అవ్యక్తరూపమున నాచే ఆవరించబడియున్నది. జీవులన్నియు నా యందున్నవి, కాని నేను వాని యందు లేను.
Sloka 5-అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగియుండదు. అచింత్యమైన నా యోగవైభమును గాంచుము! నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను, సర్వసృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమానజగత్తు నందలి భాగమును కాను. 
Sloka 6-సర్వత్రా వీచునట్టి ప్రచండవాయువు సదా ఆకాశము నందే స్థితిని కలిగియుండునట్లు, సృజింపబడిన సమస్తజీవులు నా యందు స్థితిని కలిగియున్నవని గ్రహింపుము. 
Sloka 7-ఓ కొన్తేయ! కల్పాంతమున సమస్త భౌతికసృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.