Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 13 sloka 28 to 35

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 13 sloka 28 to 35
Sloka 28-సమస్త ప్రాణులలో వాటి ఆత్మ తో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే, మరియు ఆ రెంటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే, నిజముగా చూసినట్టు.
Sloka 29-సర్వ ప్రాణులలో సమానముగా, పరమాత్మ గా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు, తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా, వారు పరమ పదమునకు చేరుకుంటారు.
Sloka 30-(శరీరము యొక్క) అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే, జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు - అని అర్థంచేసుకున్నవాడు నిజముగా చూసినట్టు.
Sloka 31-విభిన్న వైధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు.
Sloka 32-ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనివాడు, అనాదియైనవాడు, భౌతిక లక్షణములు ఏవీ లేనివాడు. దేహములోనే స్థితమై ఉన్నా, ఆయన ఏమీ చేయడు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాడు.
Sloka 33-ఆకాశము (ఖాళీ జాగా) అన్నింటిని తనలోనే కలిగిఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితముకాదు. అదే విధముగా, దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.
Sloka 34-ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో, అలాగే ఒక్క ఆత్మ యే మొత్తం శరీరమును (చైతన్యము చే) ప్రకాశింపచేయును.
Sloka 35-జ్ఞాన-చక్షువులచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గమనించేవారు, మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్దతి తెలిసినవారు, పరమ పదమును చేరుకుంటారు.
To be continued with chapter 14

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.