Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 17 sloka 22 to 28

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 17 sloka 22 to 28
Sloka 22-అనుచిత ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హతలేనివారికి (అపాత్రులకు), మర్యాద చూపకుండా, లేదా చులకనగా ఇవ్వబడిన దానము, తామసదానము గా పరిగణించబడుతుంది.
Sloka 23-"ఓం తత్ సత్" అన్న పదములు, సృష్టి మొదలు నుండి, పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులు, శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి.
Sloka 24- కాబట్టి, యజ్ఞములు చేయటంలో, దానము ఇవ్వటంలో, తపస్సులు ఆచరించటం లో - వేద విదులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ 'ఓం' అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు.
Sloka 25-ప్రతి-ఫలములను ఆశించని వారు, కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారు, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు "తత్" అన్న పదమును ఉచ్చరిస్తారు.
Sloka 26 to 27-"సత్" అన్న పదానికి అర్థం - సనాతనమైన అస్థిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ "సత్" అన్న పదము వివరిస్తుంది. కావున, ఈ ప్రయోజనము తో ఉన్న ఏ పని అయినా "సత్" అనబడుతుంది.
Sloka 28-ఓ ప్రిథ పుత్రుడా, అశ్రద్దతో చేయబడిన దానములు కానీ, యజ్ఞములు కానీ "అసత్" అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు.
To be continued with chapter 18

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.