Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 8 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 8 sloka 1 to 7
Sloka 1-అర్జునుడు ప్రశ్నించెను: ఓ దేవదేవా! పురుషోత్తమా! బ్రహ్మమననేమి? ఆత్మయననేమి? కామ్యకర్మలననేవి? భౌతికసృష్టి యననేమి? దేవతలన నెవరు? దయతో ఇది నాకు వివరింపుము.
Sloka 2-ఓ మధుసుదనా! యజ్ఞప్రభువెవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తియోగమునందు నిలిచినవారు మరణసమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు?
Sloka 3-శ్రీకృష్ణభగవానుడు పలికెను : నాశరహితమును, దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్యస్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము (కామ్యకర్మలు) అనబడును.
Sloka 4-ఓ దేహధారులలో శ్రేష్టుడా ! నిరంతరము పరిణామశీలమైన భౌతికప్రకృతి అధిభూతమనబడును(భౌతికజగత్తు). సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండెడి విశ్వరూపమే అధిదైవతమనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచియుండెడి దేవదేవుడైన నేనే అధియజ్ఞడును (యజ్ఞప్రభువును- lord of sacrifice). 
Sloka 5- అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.
Sloka 6-ఓ కౌంతేయా! దేహమును త్యజించునపుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును.
Sloka 7-కావున ఓ అర్జునా! సర్వకాలముల యందును నీవు నన్నే(శ్రీకృష్ణుని) తలచుచు నీ విధ్యుక్తధర్మమైన యుద్ధము నొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. 
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.