Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 6 slokas 20 to 26

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
శ్రీ కృష్ణుడు పలికెను..
Chapter 6 slokas 20 to 26
Sloka 20 , 21 and 23- సమాధి యనబడు పూర్ణత్వస్థితిలో మనుజుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడియుండును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మ యందే ఆనందమును, సుఖమును అనుభవింపగలుగుట యను విషయమున మనుజుని సమర్థతను బట్టి అట్టి పూర్ణత్వస్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయస్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మనుజుడు స్థితిని పొందియుండును. ఆ విధముగా స్థితుడైన అతడు సత్యము నుండి వైదొలగక, దానిని మించిన వేరొక అధికలాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచినవాడు గొప్ప కష్టమునందైనను చలింపక యుండును. భౌతికసంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే.
Sloka 24- స్థిరనిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగము నభ్యసించుచు మనుజుడు ఆ మార్గము నుండు వైదొలగక యుండవలెను. మానసికకల్పనల నుండి ఉత్పన్నమైన విషయకోరికల నన్నింటిని ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి, అతడు మనస్సు ద్వారా ఇంద్రియములను అన్నివైపుల నుండి నియమింపవలెను.
Sloka 25-నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మనుజుడు సమాధిమగ్నుడు కావలెను. ఆ విధముగా మనస్సును ఆత్మ యందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు.
Sloka 26-చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మనుజుడు దానిని అచ్చట నుండి తప్పక నిగ్రహించి ఆత్మ వశమునకు గొనిరావలెను.
To be continued....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.