Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 10 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 10 sloka 1 to 7
Sloka 1-శ్రీకృష్ణభగవానుడు పలికెను: మహాబాహువులుగల ఓ అర్జునా! మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను.
Sloka 2-సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై యున్నందున దేవతా సమూహముగాని, మహర్షులుగాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలిసికొనజాలరు.
Sloka 3-నన్ను పుట్టుకలేనివానిగను, అనాదిగను, సర్వలోకములకు దివ్యప్రభువుగను తెలిసికొనినవాడు మాత్రమే మనుజులందరిలోను భ్రాంతిరహితుడై, సర్వపాపముల నుండి ముక్తుడగును.
Sloka 4-5- బుద్ధి,జ్ఞానము, సంశయముగాని భ్రాంతిగాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధగుణములు నా చేతనే సృష్టించబడినవి.
Sloka 6-సప్తమహాఋషులు, వారికి పూర్వము సనకసనందనాదులు మరియు మనువురు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధలోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి.
Sloka 7-నా ఈ దివ్యవిభూతిని, యోగశక్తిని యథార్థముగ నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. 
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.