Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 4 sloka 25 to 30

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 4 sloka 25 to 30
శ్రీ కృష్ణుడు పలికెను 
Sloka 25-కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మమనెడి అగ్ని యందు హోమమును చేయుదురు.
Sloka 26-కొందరు (నిష్ఠ కలిగిన బ్రహ్మచారులు) శ్రవణాది కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమనెడి అగ్నియందు హోమము చేయగా, మరికొందరు (నియమితులైన గృహస్థులు) ఇంద్రియార్థములను ఇంద్రియములనెడి అగ్ని యందు అర్పింతురు.
Sloka 27-ఇంద్రియ,మనోనియమము ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియకర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనోనియమమనెడి అగ్ని యందు ఆహుతులుగా అర్పింతురు.
Sloka 28-కటినవ్రతములను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించుట ద్వారా మరియు మరికొందరు తీవ్రతపస్సులను చేయుట ద్వారా, అష్టాంగయోగ పద్ధతిని పాటించుట ద్వారా లేదా దివ్యజ్ఞానపురోగతికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞానవంతులగుదురు.
Sloka 29-ప్రాణాయామము ద్వారా సమాధి యందు నిలువగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి, శ్వాసను సంపూర్ణముగా బంధించి, అంత్యమున సమాధిమగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియమించి ప్రాణవాయువును ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పింతురు.
Sloka 30-యజ్ఞప్రయోజనము నెరిగిన ఈ కర్తలందరును పాపఫలముల నుండి శుద్ధిపది, యజ్ఞఫలమనెడి అమృతమును ఆస్వాదించినందున నిత్యమైన భగవద్ధామము వైపునకు పురోగమింతురు.
To be continued

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.