Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 13 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 13 sloka 1 to 7
Sloka 1-అర్జునుడు పలికెను : ఓ కృష్ణా! ప్రకృతి మరియు పురుషుని (భోక్త) గూర్చియు, క్షేత్రము మరియు క్షేత్రము నెరిగినవానిని గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞానలక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను.
Sloka 2-శ్రీకృష్ణభగవానుడు పలికెను; ఓ కౌంతేయా! ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును.
Sloka 3-ఓ భరతవంశీయుడా ! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము.
Sloka 4-వినుము, క్షేత్రము అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్ధ్యము ఏమిటో కూడా వివరిస్తాను.
Sloka 5-మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కువిధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది, ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది.
Sloka 6-పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు), మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము ఉన్నది.
Sloka 7-ఇచ్ఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము - ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు (వికారములు) అనబడుతాయి.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.