Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 4 sloka 11 to 17

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 4 sloka 11 to 17
Sloka 11-ఎవరు ఏ విధముగా నన్ను శరణువేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థా! ప్రతియొక్కరు అన్నివిధములా నా మార్గమునే అనుసరింతురు.
Sloka 12-లోకమున జనులు కామ్యకర్మల యందు జయమును గోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు.
Sloka 13-ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మల ననుసరించి మానవసంఘమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలిసికొనుము.
Sloka 14-నన్ను ఏ కర్మము ప్రభావితము చేయజాలదు; నేను యెట్టి కర్మఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు సైతము కర్మఫలములచే బంధింపబడడు.
Sloka 15-పూర్వకాలమున ముక్తపురుషులందరు నా దివ్యతత్త్వపు ఈ అవగాహనతోనే కర్మలను ఒనరించియుండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మనొనరింపుము.
Sloka 16-కర్మయనగా నేమో మరియు అకర్మ యనగా నేమో నిర్ణయించుట యందు బుద్ధిమంతులు సైతము భ్రాంతినొంది యున్నారు. కనుక కర్మయనగా నేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలిసికొని నీవు అన్ని ఆశుభముల నుండియు ముక్తుడవు కాగలవు.
Sloka 17-కర్మగతులను అవగాహన చేసికొనుట అత్యంత కష్టము కనుక కర్మ యననేమో, వికర్మ యననేమో, అకర్మ యననేమో ప్రతియొక్కరు చక్కగా ఎరుగవలెను. 
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.