Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 slokas 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 slokas 1 to 7
Sloka 1 -శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనస్సును నా యందే సంలగ్నము చేసి నా సంపూర్ణభావనలో యోగమభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపుము. 
Sloka 2-జ్ఞానము మరియు విజ్ఞానములను గూడిన సంపూర్ణజ్ఞానము నీకిప్పుడు నేను సంపూర్ణముగా వివరించెను. అది తెలిసిన పిమ్మట నీవు తెలిసికొనవలసినది ఏదియును మిగిలి యుండడు. 
Sloka 3-వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలిసికొనగలుగుచున్నాడు.
Sloka 4-భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఎనిమిది అంశముల సముదాయము నా భిన్నప్రకృతి యనబడును.
Sloka 5-ఓ మాహాబాహుడవైన అర్జునా! వాటికి అన్యముగా న్యునమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు.
Sloka 6-సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండుప్రకృతులే కారణములై యున్నవి. ఈ జగత్తు నందలి భౌతికము, ఆధ్యాత్మికమగు అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే యని నిశ్చయముగా నెరుగుము.
Sloka 7-ఓ ధనంజయా! నా కన్నను శ్రేష్ఠమైన సత్యము వేరొక్కటి లేదు. దారమునందు ముత్యములు కూర్చాబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడియున్నది.
To be continued.....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.