Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo..Chapter 15 sloka 14 to 20

శ్రీ భగవద్ గీత తెలుగు లో-Sri Bhagavad Gita telugu lo..
Chapter 15 sloka 14 to 20
Sloka 14-నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు ఒంటబట్టించుకొనటానికి, జీవుల ఉదరములలో ప్రాణాపానసంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను.
Sloka 15-నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు విస్మృతి (మర్చిపోవుట) కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదార్ధమును తెలిసినవాడను నేనే.
Sloka 16-సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి, క్షరములు (నశించేవి) మరియు అక్షరములు (నశించనివి). భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు.
Sloka 17-ఇవే కాక, నాశరహితమైన పరమాత్మ అయిన, ఆ పురుషోత్తముడు, ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి, సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు.
Sloka 18-నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్ధముకంటెనూ, మరియు నాశరహితమైన జీవాత్మ కంటెనూ కూడా అతీతమైనవాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడి గా కీర్తింపబడ్డాను.
Sloka 19-ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.
Sloka 20-ఓపాపరహితుడా, అర్జునా, అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును నేను నీకు తెలియచేసాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు.
To be continued with chapter 16

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.