Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 6 sloka 41 to 47

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 6 sloka 41 to 47
Sloka 41-యోగభ్రష్టులైనవాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరముల సుఖముల ననుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును.
Sloka 42-లేదా (దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో) అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మము నొందును. కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును.
Sloka 43-ఓ కురునందనా! అట్టి జన్మను పొందిన పిమ్మట అతడ గతజన్మపు దివ్యచైతన్యమును పునరిద్ధరించుకొని పూర్ణవిజయమును సాధించుటకు తిరిగి యత్నము కావించును.
Sloka 44-పూర్వజన్మపు దివ్యచైతన్య కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగము వైపునకు ఆకర్షితుడగును. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మనియమములకు సదా అతీతుడై యుండును.
Sloka 45-సమస్త కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినపుడు బహుజన్మల అభ్యాసము పిదప పూర్ణత్వమును బడసి, అంత్యమున పరమగతి పొందును.
Sloka 46-యోగియైనవాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మరతుని కన్నను అధికుడైనట్టివాడు. కనుక ఓ అర్జునా! అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము.
Sloka 47-అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను ఒనరించువాడును అగు యోగి యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివాడై యున్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము.
To be continued with chapter 7

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.