Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 17 sloka 15 to 21

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 17 sloka 15 to 21
Sloka 15-ఉద్వేగమును కలిగించని మాటలు, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రియ హితమైనవి మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది.
Sloka 16-ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము మరియు భావములో పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పెర్కొనబడినాయి.
Sloka 17-భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, వాటిని సాత్త్విక తపస్సులు అని అంటారు.
Sloka 18-కీర్తిప్రతిష్టలు, గౌరవము, మరియు గొప్పల కోసం, ఆడంబరంగా చేసే తపస్సు/యజ్ఞములు రజో గుణములో ఉన్నట్టు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి, మరియు తాత్కాలికమైనవి.
Sloka 19-అయోమయ భావాలతో, తమని తామే హింసపెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు, తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది.
Sloka 20-దానము చేయుట కర్తవ్యము (సరియైన పని) అని భావించి, తగిన పాత్రత ఉన్నవాడికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది.
Sloka 21-అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఎదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజో గుణములో ఉన్నదని చెప్పబడినది.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.