Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 5 sloka 13 to 18

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 5 sloka 13 to 18
Sloka 13-దేహమునందున్న జీవుడు తన స్వభావమును నియమించి మానసికముగా కర్మలన్నింటిని త్యజించినపుడు, కర్మను చేయక మరియు కర్మకు కారణము కాక నవద్వారపురము నందు(దేహములో) సుఖముగా వసించును.
Sloka 14-తన దేహమనెడి పురము యొక్క అధిపతియైన దేహి కర్మలను సృష్టించుటగాని, కర్మల యందు జనులను ప్రేరేపించుటగాని, కర్మఫలములను సృష్టించుటగాని చేయడు. ఇదియంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది.
Sloka 15-భగవానుడు ఎవరి పాపమును గాని, పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారు నిజజ్ఞానమును ఆవరించెడి అజ్ఞానముచే మోహము నొందుచుందురు.
Sloka 16-అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు, పగటిసమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు, అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును.
Sloka 17-బుద్ధి, మనస్సు, నిష్ఠ, ఆశ్రయములన్నియును భగవానుని యందే లగ్నమైనపుడు మనుజుడు సంపూర్ణజ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తిమార్గమున ప్రయాణించును.
Sloka 18-వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగినవారగుటచే విద్యావినయసంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమును, శునకమాంసము తినువానిని(చండాలుని) సమదృష్టితో వీక్షింతురు.
To be continued.....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.