Sunday 24 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 18 sloka 15 to 21

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 18 sloka 15 to 21
Sloka 15 to 16-శరీరము, వాక్కు, మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యదార్ధమును గ్రహింపలేరు.
Sloka 17-కర్తృత్వ అహంకార భావమును (చేసేది నేనే అన్న భావమును) విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు.
Sloka 18-జ్ఞానము, జ్ఞేయము (జ్ఞాన విషయము), జ్ఞానమును ఎఱింగినవాడు - ఇవి మూడు కర్మను ప్రేరేపించును. కరణము, క్రియ, కర్త, - ఈ మూడు కర్మ యొక్క అంగములు.
Sloka 19-జ్ఞానము, కర్మ, మరియు కర్త - ఇవి ప్రకృతి త్రి-గుణముల పరముగా ఒక్కోటి మూడు రకాలుగా ఉంటాయని సాంఖ్య శాస్త్రము పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెప్తాను వినుము.
Sloka 20-సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనశ్వరమైన ఒకే అస్థిత్వము ఉన్నట్టు తెలుసుకోనటమే సత్త్వ గుణము లో ఉన్న జ్ఞానము.
Sloka 21-ఏ జ్ఞానము చేతనయితే భిన్నభిన్న దేహములలో ఉన్న వివిధ రకముల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానము రాజసికమని (రజోగుణములో ఉన్న) గ్రహించుము.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.